మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 9
ఆయన ఒక సాధారణ వ్యక్తి కాదు,రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.ఒక సాధారణ వ్యక్తిగా వ్యవహరిస్తూ,ప్రజలతో మమేకమై వారితో కలిసిపోతారు.ఆయనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.మంగళవారం పర్యటన లో భాగంగా మణుగూరు పట్టణంలోని ఒక టీ దుకాణానికి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఒక సామాన్యునిలా వెళ్ళారు.టీ తాగుతూ ప్రజలతో ప్రజలతో మమేకమై కాసేపు మాట్లాడారు.నాయకుడికి విరామం విశ్రాంతి ఉండదు, ఎక్కడికి వెళ్లిన ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమేకమై ప్రజాసేవలో లీనమై ప్రజల కోసం ఆహార్నిశలు శ్రమిస్తున్న వారే గొప్ప నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. అలాంటి గొప్ప నాయకుడే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అని ప్రజలూ చర్చిస్తున్నారు.