మన్యం న్యూస్ గుండాల: ఇంటర్ ఫలితాల్లో గుండాల మండల విద్యార్థులు సత్తా చాటారు. ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థులు మొత్తం 97 మంది పరీక్ష రాయగా 91 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎంపీసీ లో బి వెంకటేష్ 956, గూగుల్ లోకేష్ 950, బైపీసీలో ఎన్ వినయ్ బాబు 955, ఎం సాయిబాబా 918, సీఈసీలో ఈ అరుణ్ 837, పి సాగర్ 768, ఫలితాలను సాధించారు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు సైతం జూనియర్ ఇంటర్ ఫలితాలలో సత్తా చాటారు. ఎంపీసీలో వి ఉష 922, బి అక్షయ జ్యోతి 921, బైపిసి లో అంజలి 897 సంతోషి 890, సి ఈ సి లో దుర్గారాణి668, వీరస్వామి 631, విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి తమ సత్తాను చాటారు. వీరితోపాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వివిధ గ్రూపులలో విద్యార్థులు తమ తమ సత్యసాటి ఉత్తీర్ణత సాధించారు.
