ఐకెపి వివోఏ ల వేతనాలు పెంచాలి,
సమ్మెను ఉదృతం చేస్తాం…. వి వో ఏ సంఘం
ఎమ్మార్వో కార్యాలయం ముందు దర్నా
మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండల ఐకెపి వివోఎ ల నిర్వహిస్తున్న ధర్నా లో బాగంగా వివోఏ వేతనాలను ప్రభుత్వం వెంటనే పెంచాలని,23రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెను పరిష్కారంచేయాలని డిమాండ్ చేస్తూ వి వో ఏ లు ర్యాలీ నిర్వహించి ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వి వో ఏ సంఘం మండల అద్యక్ష కార్యదర్శులు ఇర్పా అనురాధా,వీూనా మాట్లాడుతూ ప్రభుత్వం వివోఏలకు కనీస వేతనం రూ. 26000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వివోఏల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదని 23రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ వారి డిమాండ్లపై మంత్రులు స్పందించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.వి వో ఏ సమ్మెకు సిఐటియు అండగా ఉంటుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం మెుండిగా వ్యవహరించకుండా చర్చలు
జరిపి సమస్యలు పరిష్కారంచేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వివో సీసీలుగా ప్రమోషన్ ఇవ్వాలని ప్రతి వివోఏ కి రూ.10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం చేయకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు శ్యామల వెంకట్ తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా నాయకుడు కారం నరేష్ ఐద్వా మండల కార్యదర్శి పొడుపు గంటి సమ్మక్క కెవిపిఎస్ మండల కార్యదర్శి మచ్చ రామారావు ఆటో యూనియన్ మండల అధ్యక్షులు బాలాజీ వివో ఏ ఐ అనురాధ మీనా పి రవి కృష్ణవేణి ఆదిలక్ష్మి సుమలత కవిత ధనలక్ష్మి జ్యోత్స్న దుర్గ అర్జున్ భవాని దేవి నాగమణి చంద్రకళ లక్ష్మి జయలక్ష్మి రత్నకుమారి విశాల సంధ్య రమ్య సౌజన్య సరోజిని తదితరులు పాల్గొన్నారు.
