ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించి, హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని జీఎం కార్యాలయం ముందు ధర్నా*
మన్యం న్యూస్,ఇల్లందు: ఏఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యునియన్ ఆద్వర్యంలో మంగళవారం సాయంత్రం స్థానిక సింగరేణి జీఎం కార్యాలయం ముందు కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. అనంతరం డిజీఎం పర్సనల్ మోహనరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి ఎఐటియుసి రాష్ట్రసమితి సభ్యులు దేవరకొండ శంకర్, కాంట్రాక్టు వర్కర్స్ యునియన్ నాయకులు బందం నాగయ్యలు మాట్లాడుతూ.. కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సింగరేణి వ్యాప్తంగా సుమారు18 రొజులు సమ్మెచేసిన నేపథ్యంలో ఆనాడు సింగరేణి యాజమాన్యం అంగీకరించినటువంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ప్రధానంగా రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన జీఓ నెంబర్ 22ను తక్షణమే అమలుచేయాలని, సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను 1990 ఒప్పందం ప్రకారంగా పర్మినెంట్ చేసి, హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పిఎఫ్ వివరాలు తెలుపి, ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, ఇటీవల ఐటి శాఖమంత్రి కేటీఆర్ పారిశుద్ధ్య కార్మికులకు వేయి రుపాయలు వేతనాలు పెంచుతూ ప్రకటించారని అట్టి వేతనాలు సింగరేణిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వర్తింపజేయాలని వారు డిమాండ్ చేసారు. లేనిపక్షంలో కాంట్రాక్టు కార్మికుల పక్షాన ఎఐటియుసి ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని వారు హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో నాయకులు 23వ వార్డు కౌన్సిలర్ కుమ్మరి రవీందర్, సిపిఐ మండల కార్యదర్శి ఉడత ఐలయ్య, టిజెఎస్ జిల్లా ఉపాద్యక్షులు గుగులొత్ కృష్ణ, శంషుద్దిన్, రవిశంకర్, సుమన్, లింగన్న, కనకతార, ఎల్లమ్మ, కాంట్రాక్టు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.