మన్యం న్యూస్, మంగపేట.
ములుగు జిల్లా, మంగపేట మండలం , రమణక్కపేట గ్రామంలో వేద పండితుల ఆధ్వర్యంలో, వేద మంత్రాల నడుమ గ్రామ దేవతామూర్తుల ప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ శ్రీ శీతలపరమేశ్వరీ అమ్మవారు ( బొడ్రాయి) తో పాటు ఆదిలక్ష్మి, భూలక్ష్మి , ముత్యాలమ్మ తల్లి, గౌరమ్మ తల్లి, .మహాలక్ష్మి అమ్మవారు, .పోతురాజు స్వామి విఘ్నేశ్వర స్వామి గంగమ్మ .ఎల్లమ్మ తల్లి .మైసమ్మ తల్లి దానమేశ్వరస్వామి నరసింహస్వామి ధ్వజ స్థంభం మొదలగు దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపనా కార్యక్రమాల మహాక్రతువులో పంచమ రాత్రుల పూజాకార్యక్రమాలలో భాగంగా 2వ రోజు మంగళవారం మహాచండీ పూజా కార్యక్రమాలు జరిగినాయి.ఈ కార్యక్రమం లో అతిధి గా ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరు అయ్యారు.
గ్రామంలోని అన్ని వర్గాల పుణ్య దంపతులు ఈ మహాచండీ హోమంలో పాల్గొన్నారు.
