మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఏప్రిల్ 9::
ఆదివాసులు సంవత్సరాల తరబడి ఎదురుచూసిన తునికి ఆకు బోనస్ ప్రభుత్వం విడుదల చేయడంతో సిపిఎం పార్టీ పోరాటం ఫలితంగానే ఆకు కార్మికుల బోనస్ విడుదల చేయడం జరిగిందని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని ఎలమంచి సీతారామయ్య భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఏజెన్సీలోని గిరిజనలు ఎదురుచూసిన బోనస్ సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పోరాటాల వల్లే బోనస్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు 2017 నుంచి తునికి ఆకు సేకరణ బోనస్ విడుదల చేయాలని అటవీశాఖ రాష్ట్ర ప్రధాన అధికారి డోబ్రియల్ అనేకసార్లు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని ప్రభుత్వం స్పందించి బోనస్ విడుదల చేయడంతో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలానే మండలంలోని ఏజెన్సీ గ్రామంలో రోజురోజుకు పెరిగిపోతున్న డెంగ్యూ జరాలను అరికట్టాలని గ్రామ గ్రామాన మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ జిల్లా నాయకులు ఎలమంచి రవికుమార్ సిపిఎం పార్టీ భద్రాచలం నియోజవర్గ కన్వీనర్ కారం పుల్లయ్య సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చంద్రయ్య చిలకమ్మ శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు.