మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 10
పినపాక నియోజకవర్గం లోని మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఏర్పాటు చేసిన తేనేటి విందుకు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ,న్యాయ,అటవీ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. నియోజకవర్గం పర్యటనకు విచ్చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ సందర్భంగా విప్ రేగా కాంతరావు ఏర్పాటు చేసిన తేనీటి విందును స్వీకరించారు. అనంతరం విప్ రేగా కాంతారావు కుమారులు నవదీప్ దొర పుట్టిన రోజు సందర్భంగా మంత్రి అక్షింతలు వేసి దీవించారు.ఈ కార్యక్రమం లో ప్రభుత్వ విప్,రేగా కాంతారావు దంపతులు, అడిషనల్ కలెక్టర్.కర్నాటి. వెంకటేశ్వర్లు,స్థానిక జడ్పిటిసి పోశం.నర్సింహారావు,విప్ రేగా కాంతారావు వ్యక్తిగత సహాయకులు లక్ష్మణ్, సాయినాథ్,బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు తాళ్లపల్లి రజిత,నాయకులు రాహుల్ గౌడ్ ఉమామహేశ్వరరావు, అటవీశాఖ అధికారులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.