మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 10: స్థానిక రింగ్ రోడ్ లో గల మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాలలో తమ సత్తా చాటారు. 2020 నుండి ఇప్పటివరకు వరుసగా మూడు సంవత్సరాలు 100శాతం ఉత్తీర్ణత సాధించారు. పాఠశాల విద్యార్థులు 31 మందికి గాను 31 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 11 మంది విద్యార్థులు 9కి పైగా జిపిఏ, 13 మంది విద్యార్థులు 8 కి పైగా జిపిఏ, 7 గురు విద్యార్థులు 7 కు పైగా జిపిఏ సాధించగా తేజశ్రీ, శంషద్ అజ్మీ, తస్లీమ్, రేష్మ 9.3 జీపీఏ సాధించారని టి సంగీత తెలిపారు. 100 శాతం ఉత్తీర్ణత సాధించినందుకు గాను మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, పాఠశాల సిబ్బంది, విద్యాశాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు హార్షం వ్యక్తం చేశారు.