మన్యం న్యూస్ గుండాల: ఆళ్లపల్లి మండలం మర్కోడు గ్రామంలో మీసేవ కేంద్రాన్ని ఆలపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాయం నరసింహారావు,మర్కోడు సర్పంచ్ కొమరం శంకర్ బాబు ప్రారంభించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మీసేవ కోసం ఆళ్లపల్లి మండల కేంద్రానికి వెళ్లి పని చేయించుకోవాల్సిన పరిస్థితి గతంలో ఉండేదని అన్నారు మీసేవ కేంద్రం మార్కోడులో ప్రారంభం కావడంతో ప్రజలకు ఇబ్బందులు తొలిగినట్టేనని వారుఅన్నారు. ఈ కార్యక్రమంలో రాఘవపురం సర్పంచ్ ప్రేమ కళ,ఎస్సీ సెల్ అధ్యక్షులు వేమూరి రాంబాబు, నరేశ్. కొమరం జగన్ . రవి. మీసేవ నిర్వాహకులు కొమరం ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు
