మన్యం న్యూస్.ములకలపల్లి. మే 10 :మండలంలో లోని జగన్నాధపురం గ్రామములో రైతు వేదిక లో సిపిఐఎంఎల్ ప్రజాపంథా అనుబంధ సంఘాలైన అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం,అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం.సంఘాల యొక్క పాల్వంచ డివిజన్ నిర్మాణ జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసారు.ఈ సమావేశానికి అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముద్ద బిక్షం పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు రైతులు,కూలీల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనవని రోజురోజుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతూ నిత్యవసర ధరలు పెంచుతూ సామాన్య ప్రజలకు అందని ద్రాక్ష తీగల చేస్తూ పోతున్నాయి.రైతు పండించిన పంటకు మాత్రం గిట్టుబాటు ధరలు కల్పించకుండా రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉసురు పోసుకుంటున్నాయని,పెరిగిన నిత్యవసర సరుకుల ధరలతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతుంటే పరిశ్రమలలో కార్మికుల కూలీలకు పని చేసిన తగిన కూలి చెల్లించకుండా, కనీస కూలి వేతనాలను అమలు చేయకుండా ఈ ప్రభుత్వాలు కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్నయని ప్రతిరోజు కూలి పనిచేసి వచ్చిన డబ్బులతో నిత్యవసర సరుకులు కొనలేని పరిస్థితిలో కార్మికులు జీవిస్తున్నారని,పెరిగిన నిత్యవసర సరుకు ధరలకు తగిన విధంగా కూలీల వేతనాలను పెంచాలని మాట్లాడటం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం,అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘల జిల్లా కార్యదర్శిలు కల్లూరి కిషోర్,అమర్లపూడి రాము ఈ నూతన కమిటీని 9 మందితో ప్రవేశ పెట్టడం జరిగింది.అఖిల భారత రైతు సంఘం అధ్యక్షులుగా వగ్గేల ప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా నకిరికంటి నాగేశ్వరరావు,అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులుగా కూర్సం ముత్యాలరావు,ప్రధాన కార్యదర్శిగా పోతుగంటి లక్ష్మణ్.వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.అనంతరం ఎన్నికైన ఇరు సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ.పార్టీ మా మీద నమ్మకం ఉంచి ఇచ్చిన బాధ్యతను సక్రమంగా అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని మాట్లాడారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా కార్యవర్గ సభ్యులు నుపా భాస్కర్, డివిజన్ కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్,జిల్లా నాయకులు నిమ్మల రాంబాబు, ప్రజాపంథా పార్టీ మండల కార్యదర్శి కొర్స రామకృష్ణ డివిజన్ నాయకులు వాసం బుచ్చిరాజు పూణెం రమేష్ మండల కమిటీ సభ్యులు తిమ్మంపేట ఎంపీటీసీ నుపా సరోజిని,పాత గంగారం ఎంపీటీసీ మడక విజయ,నకిరికంటి నాగేశ్వరావు,పుప్పాల నాగేశ్వరరావు,ఓరుగంటి శ్రీను,పద్దం లక్ష్మణరావు తదితరులు పాల్గొనడం జరిగింది.
