మన్యం న్యూస్ గుండాల: పిఎసిఎస్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాన్ని పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, ఎంపీపీ ముక్తి సత్యం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ 1962 రూపాయల ధర ప్రభుత్వం నిర్ణయించినట్లు వారు పేర్కొన్నారు. 14% తేమ ఉండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రామక్క, సీఈవో రాంబాబు,వార్డు మెంబర్ కృష్ణ , కాంగ్రెస్ పార్టీ నాయకులు పాపారావు, తదితరులు పాల్గొన్నారు
