మన్యం న్యూస్ చండ్రుగొండ, మే 10: పదో తరగతి పరీక్షల్లో మండలంలో మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదల అయిన 10 ఫలితాల్లో చండ్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 101 మంది విద్యార్థులకు గాను 59 మంది ఉత్తీర్ణత సాధించగా సరా సరి 58శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. పోకలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 22 మందికి గాను 18మంది ఉత్తీర్ణత సాధించారు, సరాసరి 82శాతం, రేపల్లెవాడలో 36 మందికి గాను 13 మంది ఉత్తీర్ణత సాధించగా 36శాతం ఉత్తీర్ణత సాధించారు. మద్దుకూరులో 08 మందికి గాను 02 ఉత్తీర్ణత సాధించగా, సరాసరి 25 శాతం ఉత్తీర్ణత సాధించారు. చండ్రుగొండ కేజిబివి వసతిగృహంలో 46 మందికి గాను 31 మంది ఉత్తీర్ణత సాదించగా, సరాసరి 67.3శాతం ఉత్తీర్ణత సాధించారు. చండ్రుగొండ సెయింట్ జోష ఠశాలలో 21 మందికి గాను 20 మంది ఉత్తీర్ణత సాధించగా, సరాసరి95.25శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు మండల విద్యశాఖాధికారి సత్తెన్న తల్లి సత్యనారాయణ తెలిపారు. పదో తరగతిలో మిశ్రమ ఫలితాలు వచ్చాయని అన్నారు