మన్యం న్యూస్ దుమ్మగూడెం ఏప్రిల్ 10::
మండలంలోని నరసాపురం గ్రామంలో గత మూడు సంవత్సరాలుగా మిషన్ భగీరథ నీరు రాక ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదురవుతున్నారని వేసవి కాలం కావడంతో సమస్య మరింత ఇబ్బందిగా మారిందని అధికారులకు ఎన్నిసార్లు సమస్యను వినిపించుకున్న పట్టించుకోవడంలేదని ప్రజలు తెలపడంతో బిఎస్పి మండల నాయకులు ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ శివరామకృష్ణ, మిషన్ భగీరథ ఏ ఈ వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదారి జలాలు పక్కనే ఉన్న మండలంలో అనేక గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు అందడం లేదని కొన్ని గ్రామాలకు నీటి కలెక్షన్ కూడా లేక వాటర్ ట్యాంకులు నిరుపయోగంగా ఉన్నాయని తెలిపారు మండలంలో మంచినీటి సౌకర్యం లేని గ్రామాలను గుర్తించి వేసవికాలం నీటి కొరత లేకుండా చూడాలని అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ మండల కార్యదర్శి పుడుతూరి రవీంద్ర కోశాధికారి సాగర్ నర్సాపురం మాజీ ఎంపీటీసీ వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు.