UPDATES  

 10 వ తరగతి విద్యార్థులను సన్మానించి ఎంపీపీ జల్లిపల్లి

 

మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 10: అశ్వారావుపేట పట్టణంలోని స్థానిక జవహర్ విద్యాలయం నందు 10 తరగతిలో 10/10 మార్కులు సాధించిన శీమకుర్తి అన్వితా అలాగే కొలుసు చరణ్ కార్తిక్ విద్యార్థులను సన్మానించి, జ్ఞాపికలను అందజేసిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ బుధవారం పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలైన సందర్బంగా అశ్వారావుపేట మండలంలో మొత్తం 10/10 ఉత్తీర్ణత 3 విద్యార్థులు సాధించగా వారిలో ఇద్దరు జవహార్ విద్యాలయం ఒకరు సూర్య స్కూల్ విద్యార్ధులనీ అలాగే 10 వ తరగతి పరీక్షలలో అధ్యధిక శాతం ఉత్తీర్ణత రావడం చాలా సంతోషంగా ఉందని పదవ తరగతి లో పాసైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే చదువు నీ ఇష్టంగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు వారీ విజయానికి అహర్నిశలు శ్రమించిన ఉపాధ్యాయ అధ్యాపకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ప్రభుత్వ పాటశాలలో చదివే అంగవైకల్యం మాటలు రాని విద్యార్థిని కూడ 10వ తరగతి లో మంచి మార్కులు సాధించి విజయం సాధించిందని అయన తెలిపారు. అలాగే 10వ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులకు అశ్వారావుపేట నియోజక వర్గ శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరరావు చరవాని ద్వార శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు పాటశాల ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్, మైథిలీ, భారతీ, అలి, రమేష్, సోమరాజు, వేంకటేశ్వర రావు మరియు పాటశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !