అభివృద్ధి పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ రేగా*
మన్యం న్యూస్ గుండాల ఆళ్లపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పరిశీలించి నూతన పనులకు శంకుస్థాపన చేశారు. గుండాల పర్యటన ముగించుకున్న తర్వాత ఆళ్లపల్లి మండలంలో ఆయన పర్యటించారు నిర్మిస్తున్న హై లెవెల్ వంతెనల పనులను ఆయన పరిశీలించి అధికారులకు తగు సూచనలను చేశారు. వీటితోపాటు నూతనంగా జల్లేరు వాగుపై చంద్రాపురం వద్ద రూ.4 కోట్ల 60 లక్షల రూపాయలతో నిర్మించనున్న వంతెనకు శంకుస్థాపన చేశారు. బట్టుపల్లి మర్కోడ్ రహదారిపై సిసి రహదారి నిర్మాణం కోసం3 కోట్ల 50 లక్షల నిధులతో చేపట్టబోయే పనులకు సైతం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంతరావు, ఎంపీపీ మంజు భార్గవి, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, పార్టీ ప్రధాన కార్యదర్శి బాబా, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, వివిధ సంఘాల అధ్యక్షులు సర్పంచులు, ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు
