మన్యం న్యూస్ చండ్రుగొండ,మే11: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి… రావికంపాడు గ్రామపంచాయతీ, దుబ్బతండ గ్రామానికి చెందిన తేజావత్ రవి (30) తనకు గల పొలంలో పచ్చిగడ్డికి నీళ్లు పెట్టేందుకు గురువారం విద్యుత్ మోటర్ స్విచ్ వేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి స్పృహ తప్పిపడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటహుటిన చండ్రుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడుకి భార్య సంధ్య. కుమారుడు ఇద్దరు కుమార్తెలు కలరు. విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతచెందటంతో గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి.