- కాంగ్రెస్ నాయకుల్లారా ఖబర్దార్
- మాటలు జాగ్రత్త !
- మా రేగా అన్నను విమర్శించే స్థాయి మీది కాదు
- పార్టీ మారకుండానే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యారా ?
రేగా యూత్ సభ్యులు పోతురాజ రవి హెచ్చరిక
మంజు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబొమని రేగా యూత్ సభ్యులు పోతురాజు రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్తల్లో నిలవాలని రేగా కాంతారావు గురించి ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేసే చిల్లర చేష్టలు మానుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులమంటూ రేగా కాంతారావు గురించి మాట్లాడే అర్హత లేని కొందరు వాట్సాప్ లో చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే నవ్వు వస్తుందని, టికెట్ రాకపోతే పార్టీ మారేవాళ్ళు, వేరే పార్టీ నుంచి వచ్చి టికెట్ మాదే అనే వాళ్ళతో కలిసి తిరిగే మీరు రేగా ను విమర్శించడం హస్యాస్పదమన్నారు. రేగా కాంతారావు ప్రజా నాయకుడని కొనియాడారు. ఆయన ఉన్నని రోజులు జిల్లాలో బీఆర్ఎస్ ను తట్టుకోవడం మీ తరం కాదని అన్నారు. తనను నమ్మి ఓట్లు వేసిన ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారిన రేగన్న గురించి మాట్లాడి అభాసుపాలు కావద్దని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తలకిందులుగా తపస్సు చేసిన జీవితంలో ఎమ్మెల్యే కాలేని కొందరి అనుచరులుగా తిరిగే వ్యక్తులు నేడు రేగా గురించి మాట్లాడటం చూసి కొత్తగూడెం ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రేగా గురించి మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు హీరోలు కాలేరని అన్నారు. రేగాను అనవసరంగా వ్యక్తిగతంగా విమర్శిస్తు, అవాకులు చవాకులు పేలుతున్నారని అన్నారు. వ్యక్తిగతంగా విమర్శిస్తే ఊరుకోమని జిల్లా అంతటా తమకు కూడా కార్యకర్తలు ఉన్నారని దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. పార్టీ మారకుండానే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఎలా అయ్యారని ప్రశ్నించారు.పార్టీలో ఉన్న వర్గపోరును నిలువరించలేని డీసీసీ అధ్యక్షుడి మెప్పు కోసం ఎంతమంది నాయకులు రేగాపై ప్రకటనలు ఇప్పిస్తున్నారో తమకు తెలుసని,
విమర్శనాత్మకంగా మాట్లాడకపోతే తాము కూడా దేనికైనా తెగిస్తామని పోతురాజు రవి హెచ్చరించారు.