మన్యంన్యూస్,ఇల్లందు*:భద్రాద్రి కొత్తగూడెంజిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును జిల్లా గ్రంధాలయసంస్థ ఛైర్మెన్ దిండిగల రాజేందర్, జిల్లా అధికార ప్రతినిధి పులిగల్ల మాధవరావు, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ జానీపాషా మరియు జిల్లా సీనియర్ నాయకులు యాలమద్ది రవిలు మర్యాదపూర్వకంగా కలిశారు. గుండాల మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల నిమిత్తం ఇల్లందు మీదుగా వెళుతున్న రేగాను వారు కలవటం జరిగింది.
