మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామం శివారు గల మిరుప చేనులో గుర్తు తెలియని మృతదేహని అటుగా వెళుతున్న వ్యవసాయ కూలీలు గుర్తించారు. ఇట్టి విషయాన్ని బెస్తగూడెం గ్రామ సర్పంచికి తెలియజేశారు. వెంటనే గ్రామసర్పంచ్ వెంకటాపురం స్టేషన్ ఇన్చార్జ్ ఎస్సై అశోక్ కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంకటాపురం చార్జ్ ఎస్సై అశోక్ కానిస్టేబుల్ లతో ఘటన స్థలానికి చేరుకొని ఈ విషయం పట్ల కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా స్థానికుల సమాచారం మేరకు వెంకటాపురం మండలం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని సున్నం బట్టి వీధి వాసిగా గుర్తించారు.. ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు చేరవేసి వారిని ఘటనా స్థలానికి రప్పించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయగా. మృతుని పేరు పాణెం మల్లయ్య 65. అని ఆయనకు మతిస్థిమితం ఉండదని ఎటుపడితే అటే పోతూ ఉంటాడని , గతంలో కూడా ఇలానే పోయి వారం తర్వాత దొరికినట్టుగా వచ్చిన,వారి అబ్బాయి పాణెం. నరసింహారావు తెలిపారు. విషయం తెలుసుకున్న అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి పంచనామా చేసి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టుగా ఏఎస్ఐ అక్బర్ తెలిపారు.
