మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండలం రమణక్కపేటలో మే 08 నుంచి మహా దైవ కార్యక్రమం బొడ్రాయి మహోత్సవాలు అంగరంగ వైభవం జరుగుతున్నాయి.ఈ బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమంను ఉమ్మడి వరంగల్ జిల్లా చింతేనెక్కొండ గ్రామంకు చెందిన శతాధిక ప్రతిష్ట అఘోర ఉపాసకులు సిద్ధాంతి శ్రీ శ్రీ శ్రీ సంజీవ కుమార స్వామి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం మే 11 తెల్లవారు జామున 3:25 నిముషాలకు లక్ష్మి నరసింహ స్వామి ద్వజ స్థూపం ప్రతిష్టపాన చేశారు. ఉదయం 7 గంటలకు వాస్తు పూజ వాస్తు హోమం వాస్తు పర్యాగ్ని కరణం ఉదయం 9:32 నిముషాలకు గ్రామ దేవత మూర్తుల బొడ్రాయి ప్రతిష్టపానను ప్రత్యేక పూజలు చేసి ప్రతిష్ట చేశారు.రాత్రి 12 గంటలకు బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో కీలక ఘట్టమైన గ్రామ బలిహరణ పోలి ముద్ద ఊరి చుట్టు పోలి కట్టు కార్యక్ర మం ను నిర్వహించారు.బొడ్రాయి కార్యక్రమం ను మంగ పేట ఎస్ఐ తాహేర్ బాబా పరిశీలించారు.శతాధిక ప్రతిష్ట అఘోర ఉపాసకులు సిద్ధాంతి శ్రీ శ్రీ శ్రీ సంజీవ కుమార స్వామిజీ మంచి చెడుల దోషాలు కూడ చేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో బొడ్రాయి ఉత్సవ కమిటీ సభ్యు లు గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.