- నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి
- అసాంఘిక కార్యకలాపాలకు సహకరించవద్దు
- -మణుగూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్యం రమేష్
మన్యం న్యూస్ మణుగూరు టౌన్ మే 11
నేరాల పట్ల ఆటో యూనియన్ వర్కర్స్ అప్రమత్తంగా ఉండాలని మణుగూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్యం రమేష్ తెలిపారు.గురువారం మండంలోని వేణు రెస్టారెంట్ లో మణుగూరు సబ్ డివిజన్ డీఎస్పీ ఎస్.వీ రాఘవేందర్ రావు ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్యం రమేష్ సమక్షంలో ఆటో యూనియన్ వర్కర్స్ కు నేరాల పట్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.ఈసందర్బంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్యం రమేష్ మాట్లాడుతూ,ఆటో యూనియన్ వర్కర్స్ మండలలో జరిగే నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు.ఆటో డ్రైవర్లు తమ ఆటోల ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు సహకరించవద్దని తెలిపారు. ఎవరైనా డ్రైవర్లు అసాంఘిక కార్యకలాపాలకు సహకరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని అన్నారు.అలాగే మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నట్లైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.సమాచారం అందించిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని వర్కర్స్ కు హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా ప్రతి ఆటో డ్రైవర్ తమ వాహనానికి సంబంధిచిన పత్రాలను తమ వెంట ఉంచుకోవాలని,ఆటోపై నెంబర్ కలిగి ఉండాలని సూచించారు.ఎలాంటి పత్రాలు, నెంబర్ లేని ఆటోలను నడిపితే వారిపై కేసులు నమోదు చేస్తామని డ్రైవర్లకు గుర్తు చేశారు.ప్రతి ఆటో డ్రైవర్ పోలీసులకు సహకరించాలని కోరారు.అనంతరం మణుగూరు సబ్ డివిజన్ డీఎస్పీ ఎస్.వీ రాఘవేందర్ రావు మాట్లాడుతూ,ప్రతి ఆటో డ్రైవర్ తమ వృత్తిని గౌరవంగా చేసుకుంటు సమాజంలో బ్రతకాలన్నారు.ఎట్టి పరిస్థితులలో కూడా డ్రైవర్లు అసాంఘిక కార్యకలాపాలకు సహకరించవద్దని తెలియజేశారు.ఎవరైనా అసాంఘిక కార్యకలాపాకు సహకరిస్తే వారికీ కఠిన చర్యలు తప్పవన్నారు.ఈ అవగాహన కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఆటో యూనియన్ నాయకులు,డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.