మన్యం న్యూస్ గుండాల: ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ను కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయనపల్లి ఎంపీటీసీ కృష్ణారావు గురువారం చిన్న వెంకటాపురం బ్రిడ్జి శంకుస్థాపన వద్ద సన్మానించారు. తన ఎంపీటీసీ పరిధిలో అత్యధికంగా నిధులు కేటాయించి అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు సన్మానించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుతారి సత్యం, ఏడూర్ల బుచ్చి రాములు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
