UPDATES  

 త్వరలోనే సీఎం చేతుల మీదుగా పోడు పట్టాల పంపిణీ ప్రభుత్వ విప్ రేగా

కళ్యాణ లక్ష్మి ని ఇచ్చే సత్తా ఏ రాష్ట్రానికి అయినా ఉందా*
సర్వే అయిన ప్రతి భూమికి పోడుపట్టానందిస్తాం
త్వరలోనే సీఎం చేతుల మీదుగా పోడు పట్టాల పంపిణీ ప్రభుత్వ విప్ రేగా
మన్యం న్యూస్ గుండాల: కళ్యాణ లక్ష్మి ఇచ్చే సత్తా దేశంలో ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఉందా అని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. గురువారం గుండాల రైతు వేదికలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి డబ్బులు ఇప్పటి వరకు గుండాల మండలానికి ఆరు కోట్ల రూపాయలు మంజూరయ్యాయని ఆయన అన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచుల పెళ్లి కోసం లక్ష రూపాయలు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హామీ మేరకు పోడు పట్టాలు త్వరలోనే సర్వే జరిపిన ప్రతి భూమికి అందుతాయని ఆయన అన్నారు. కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బూటకపు హామీలు ఇస్తుంటారని వారి మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన అన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా నియోజకవర్గంలోని పోడు రైతులందరికీ పోడు పట్టాల పంపిణీ చేపడతామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నాగ దివ్య, ఎంపీడీవో సత్యనారాయణ, పంచాయతీరాజ్ సైదులు రెడ్డి, ఏఈ అఖిల్, టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధులు భవాని శంకర్, అన్వర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వీరస్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య, ఎంపీపీ సత్యం, మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య,బీసీ సెల్ అధ్యక్షులు రమేష్ ,  సుధాకర్, తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !