మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 11
మణుగూరు మండలం లోని సమితిసింగారం,మణుగూరు,రామానుజవరం గ్రామాలకు చెందిన బీటీపీఎస్ రైల్వే లైన్ లో ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు కేటాయించిన 113 ఇండ్ల ప్లాట్ లకు గానూ సదరు రైల్వే లైన్ లో కోల్పోయిన నివాస గృహాలను త్వరితగతిన ఖాళీ చేయాలని భూసేకరణ అధికారి ఎల్.ఏ, భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్ కలెక్టర్ కర్నాటి వేంకటేశ్వర్లు, తెలిపారు.ఇల్లు,కోల్పోయినవారికి ఇంటి విలువ,రవాణా ఖర్చుల చట్టం 2013 ప్రకారంగా ఇంటి స్థలము,వారికి రావాల్సిన వేతనం, పునరావాసం క్రింద వచ్చే మొత్తం రూ. 15,76,83,000 రూపాయాలను పూర్తి స్థాయి లో చెల్లించటం జరిగింది అని వారు తెలిపారు.ఈ మేరకు గురువారం అడిషనల్ కలెక్టర్ వేంకటేశ్వర్లు ఆదేశాల ప్రకారం తిర్లాపురం గ్రామంలోని 2 ఇండ్లను కూల్చివేయడం జరిగింది అని తహశీల్దార్ నాగరాజుతెలిపారు.మణుగూరు,సమితిసింగారం,తిర్లాపురం లోని మిగిలిన ఇండ్లను కూడా త్వరితగతిన ఖాళీ చేయవలసిందిగా అడిషనల్ కలెక్టర్ వేంకటేశ్వర్లు ఆదేశించారు అని అన్నారు. నిర్వాసితులు త్వరగా ఇల్లు ఖాళీ చేయాలి తహశీల్దార్ నాగరాజు తెలిపారు