UPDATES  

 ఆ బిల్లు ఆమోదం పొందితే భారతీయులకు శుభవార్త

అమెరికా కాంగ్రెస్ సభలో అదికార డెమోక్రటిక్ పార్టీ 2023 పౌరసత్వ బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తుంది. ఈ బిల్లును పాలకులు అనుకున్నట్టుగా ప్రవేశపెట్టి ఆమోదముద్ర పడితే మాత్రం అగ్రరాజ్యంలోని భారతీయులతో పాటు మెక్సికన్ల నెత్తిన పాలు పోసినట్టు. గ్రీన్ కార్డుల జారీలో దేశాలవారీ కోటాను ఎత్తివేసి, హెచ్1బి వీసాల జారీలో కీలకమైన మార్పులు చేయాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది.

దేశాలవారీ కోటాల వల్ల మునుపటి సంవత్సరాల్లో ఎవరికీ కేటాయించకుండా మిగిలిపోయిన గ్రీన్ కార్డులను వలసదారుల సంతానానికీ, భార్యలు లేదా భర్తలకు మంజూరు చేయడం ద్వారా వలసదారుల కుటుంబాలను ఏకం చేయాలని సిఫార్సు చేసింది. కుటుంబాల వలసకు దేశాలవారీ కోటాలను పెంచాలనీ ప్రతిపాదించింది.

స్టెమ్ కోర్సుల్లో అమెరికా విశ్వవిద్యాలయాల నుంచి పీజీ డిగ్రీలు పొందినవారు అమెరికాలో ఉండిపోవడానికి వీలు కల్పించాలని కోరింది. హెచ్1బి వీసాదారుల కుటుంబీకులకు ఇక్కడ పనిచేయడానికి అనుమతి ఇవ్వాలనీ ప్రతిపాదించింది.

సరైన పత్రాలు లేకుండా అమెరికాకు వలసవచ్చిన 1.1 కోట్ల మందికి పౌరసత్వం ఇవ్వడానికి ఈ బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయి. వీరిలో వ్యవసాయ కూలీలూ ఉంటారు. సరైన పత్రాలు లేకుండా అమెరికాకు వచ్చినా పన్నులు సక్రమంగా చెల్లించినవారికి ఐదేళ్లలో పౌరసత్వం ఇవ్వాలని బిల్లు సూచిస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !