UPDATES  

 రెండు దశల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశానికి…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశానికి రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి దరఖాస్తులు ఆహ్వానించి, జూన్ 26వ తేదీ నుంచి అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు తెలిపారు. ఈ మేరకు తొలిదశ అడ్మిషన్ల షెడ్యూల్‌ను ఆయన వెల్లడించారు.
2023-24 విద్యా సంవత్సరానికి అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రైవేటు ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, కో ఆపరేటివ్, ఎపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబర్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ఇన్సెంటివ్, ఏపీ మోడల్ జూనియర్ కాలేజీలు, హైస్కూల్ ప్లస్, కాంపోజిట్ డిగ్రీ కాలేజీలు, జనరల్, ఒకేషనల్ స్ట్రీమ్‌లలో రెండేళ్ళ కాలపరిమితితో కూడా ఇంటర్మీడియట్ కోర్సులకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను ఈ నెల 15వ తేదీ నుంచి విక్రయిస్తారు.

పూర్తి చేసిన దరఖాస్తులను జూన్ 14వ తేదీ లోపు చేరవేయాల్సి ఉంటుంది. 26వతేదీ నుంచి తొలి దశ అడ్మిషన్లు ప్రారంభిస్తారు. ఇంటర్నెట్ మార్కుల జాబితా, విద్యార్థులు చివరగా చదివిన పాఠశాల అధికారులుజారీ చేసిన పదో తరగతి పాస్ సర్టిఫికేట్, టీసీలతో తాత్కాలిక అడ్మిషన్లు కల్పించాలని అన్ని జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్ళకు ఇంటర్ బోర్డు కార్యదర్శి శేషగిరి బాబు సూచించారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు జూన్ ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. రెండో దశ అడ్మిషన్లు షెడ్యూల్‌ను త్వరలోనే విడుద చేస్తామని కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !