మోచా తుఫాను “చాలా తీవ్రమైన” తుఫానుగా తీవ్రమవుతుంది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) పశ్చిమ బెంగాల్‌లో అత్యవసరర సేవల కోసం ఎనిమిది బృందాలను, 200 మంది రక్షణ సిబ్బంది మోహరించారు.
మోచా తుఫాను ఆగ్నేయ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై తీవ్ర తుఫానుగా మారిందని అధికారులు తెలిపారు. కాక్స్ బజార్ సమీపంలో బంగ్లాదేశ్‌లోని లోతట్టు తీర ప్రాంతంలో 1.5-2 మీటర్ల తుఫాను వచ్చే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
మత్స్యకారులు ఆదివారం వరకు ఈశాన్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎండీ కార్యాలయం కోరింది. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలను నిర్వహించడానికి అత్యవసర ఆపరేషన్ కేంద్రాలు 24 గంటలు పనిచేస్తున్నాయని ఎన్డీఆర్ఎఫ్ 2వ బెటాలియన్ కమాండెంట్ గుర్మీందర్ సింగ్ తెలిపారు.