UPDATES  

 జూలూరుపాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబురాలు.

 

మన్యం న్యూస్: జూలూరుపాడు, మే 13, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ ఆధిక్యం సాధించడంతో జూలూరుపాడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు శనివారం సంబరాల్లో మునిగిపోయారు. మండల పార్టీ ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డు కృష్ణయ్య మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతోనే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, ఇదే ఉత్సాహంతో ఈ ఏడాది తెలంగాణ ఎన్నికల్లో ఛత్తా చాటుతామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన పై ప్రజలు విసిగిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు లాకావత్ లచ్చు నాయక్, తాళ్లూరి అచ్చయ్య, మంద బాబు, చాపలమడుగు నరసింహారావు, పాపిన్ని జనార్దన్, కట్రం ప్రసాద్, చందా, బానోత్ బాబు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !