మన్యం న్యూస్ : జూలూరుపాడు, మే 13, మండల కేంద్రంలోని వెంగన్నపాలెం గ్రామానికి చెందిన ఓ ఛానల్ రిపోర్టర్ తంబర్ల పుల్లారావు విధి నిర్వహణలో భాగంగా బైక్ పై వెళ్తుండగా ఇటీవల సుజాతనగర్ మండలం సర్వారం వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న జిఎస్ఆర్ ట్రస్ట్ ఛైర్మన్, తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు శనివారం పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని ప్రజలకు చేరువై వార్తలను మీ ద్వారా అందించాలని ఆయన ఆకాంక్షించారు. వీరితోపాటు పాపకొల్లు మాజీ ఎంపీటీసీ రోకటి సురేష్, సీనియర్ తెలంగాణ ఉద్యమ నాయకులు వేల్పుల నరసింహారావు, సీనియర్ జర్నలిస్ట్ బాపట్ల మురళి, నాగచైతన్య తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.