మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 13: అశ్వరావుపేట మండలం, అశ్వరావుపేట గ్రామంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు శనివారం సమ్మె విరమించుకుని విధుల్లో చేరిన ఆసుపాక గ్రామపంచాయతీ కార్యదర్శి మోతిలాల్ ను అభినందించిన అశ్వరావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులు వారి యొక్క ఉద్యోగ క్రమబద్ధీకరణ కోసం సమ్మె చేయడం అందరికీ తెలిసిందే, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులను తప్పకుండా రెగ్యులైజేషన్ చేస్తానని గతంలోనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీ లో ప్రకటించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే, కానీ పంచాయతీ కార్యదర్శులు తొందరపాటు నిర్ణయంతో కనీసం పంచాయతీ రాజ్ మినిస్టర్ తో గాని ప్రభుత్వంతో గాని ఎటువంటి చర్చలు జరపకుండా ఇలా సమ్మె చేయడం సరికాదని, అతి త్వరలోనే మన తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులను రెగ్యులైజేషన్ చేస్తున్నదనీ, కావున ప్రతి ఒక్క కార్యదర్శి మి సమ్మే ను విరమించి తిరిగి వీధుల్లో చేరాలని, ప్రభుత్వం మిమ్మలని మీరు చేసే సేవలను గుర్తించింది కాబట్టే జీతాలను పెంచిందని మీరు మీ ఒక్క ఉద్యోగాలలో చేరి మీ యొక్క పనులు చేసుకుంటూ ఉండాలని ప్రభుత్వం తప్పకుండా మీ ఒక్క సమస్యలనూ తీరుస్తుందని తెలియజేసారు. అలాగె ఈ రోజు వీధుల్లో చేరిన అసుపాక గ్రామ పంచాయతీ కార్యదర్శి మోతిలాల్ ను మంచి నిర్ణయం తీసుకున్నావని అభినందించి ఎంపీడీఓ తో కలిసి రీ జాయినింగ్ లేటర్ తీసుకున్న అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు ఎంపీడీఓ శ్రీనివాస రావు, ఎంపీఓ సీత రామరాజు తదితరులు పాల్గొన్నారు.