మన్యం న్యూస్ మణుగూరు టౌన్ :మే 13
మణుగూరు పట్టణ పరిధలోని శివలింగాపురం గ్రామం లో ఇటీవల అనారోగ్య కారణాల వల్ల అస్వస్థతకు గురై మరణించిన యాకూబీ కుటుంబ సభ్యులను శనివారం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తాళ్లపల్లి యాదగిరి గౌడ్,యూత్ నాయకులతో కలిసి పరామర్శించారు.ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆదేశాల మేరకు రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం వితరణ గా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బోశెట్టి రవి ప్రసాద్,మణుగూరు టౌన్ యూత్ ప్రధాన కార్యదర్శి గుర్రం సృజన్,జక్కం రంజిత్, స్థానిక నాయకులు రామంచి కోటేశ్వరరావు,షేక్ బాజీ, అమీర్,చల్లా శ్రీను,రేగా సోషల్ మీడియా ప్రతినిధులు, తోటమల్ల శివశంకర్,తాళ్లపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.