మన్యంన్యూస్,ఇల్లందు..తెలంగాణరాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ ను శనివారం ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు హరిప్రియ హరిసింగ్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈనెల 19న ఇల్లందు నియోజకవర్గంలోని గార్ల మండలంలో జరగబోయే ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆహ్వానించేందుకు మంత్రి సత్యవతి రాథోడ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. మహబూబాబాద్ జిల్లా మంత్రి క్యాంప్ కార్యాలయం నందు మంత్రి సత్యవతి రాథోడ్ కు పుష్పగుచ్చమిచ్చి ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసి నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో గార్ల మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లింగాల ఉమేష్, మండల రైతు బంధుసమితి అధ్యక్షులు పానుగంటి రాధాకృష్ణ, ఎంపీటీసీల పోరం అధ్యక్షుడు శీలంశెట్టి రమేష్, గార్ల మండల నాయకులు రాములు, వెంకటేష్ తదితరులు మంత్రిని కలిసినవారిలో ఉన్నారు.
