UPDATES  

 కర్ణాటక ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతం అవుతాయి: కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు చీమల వెంకటేశ్వర్లు

మన్యంన్యూస్,ఇల్లందు:కర్ణాటక సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం పట్ల పట్టణపార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడ్డాయి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల మద్దతు లేకుండా పూర్తి మెజారిటీ స్థానాల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్దంగా ఉన్న సందర్భంలో ఇల్లందు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం ముందు నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకోవడం జరిగింది. బాణాసంచా కాలుస్తూ స్వీట్లు పంచుకుంటూ ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు చీమల వెంకటేశ్వర్లు, పార్టీ పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియెల్ లు మాట్లాడుతూ… బిజెపి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన దగ్గర్నుంచి కాంగ్రెస్ పార్టీ పట్ల అహంకార పూర్తిగా వ్యవహరించడం, మతతత్వ భాజపా స్వార్ద రాజకీయాలను గమనించిన ప్రజలు కర్ణాటకలో చిత్తుచిత్తుగా ఓడించడం జరిగిందన్నారు. పేదల సంక్షేమం కోసం పెద్దపీట వేసే కాంగ్రెస్ పార్టీ గెలవటం హర్షణీయం అని, అందుకు కారణం అయిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి కూడా ఇదే గతి పడుతుందని, కర్ణాటక ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతం అవుతాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మండల అధ్యక్షులు పులి సైదులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీమల వెంకటేశ్వర్లు, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎండి జాఫర్, పట్టణ ఉపాధ్యక్షులు ఐజాక్, సైదామియా, పట్టణ బీసీ సెల్ నాయకులు శంకర్, పట్టణ మైనారిటీ నాయకులు మసూద్, పట్టణ ఎస్సీ సెల్ నాయకులు లింగంపల్లి శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి వాసుదేవ్, పట్టణ సీనియర్ నాయకులు జీవి భద్రం, ఈశ్వర్ గౌడ్, ఐఎన్టియుసి ఉపాధ్యక్షులు లింగాల జగన్నాథం, వెంకట్ నారాయణ, అన్వర్, పట్టణ మహిళా నాయకులు గాలిపల్లి స్వరూప, నిర్మల, పట్టణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సుమిత్ కోరి, వర్మ, గడ్డి శీను, ఎం శ్యామ్, కాయం రమేష్ తదితరులు  పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !