మన్యం న్యూస్ మంగపేట.
మంగపేట మండలం లోని రాజుపేట ( కొత్తూరు )శ్రీ కాళికాదేవి ఇసుక క్వారీ లేబర్ కాంట్రాక్టు సహకార సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ (06/2021-MU) పాలకమండలి సభ్యులకు ఎన్నికలు శనివారం జరిగినవి.శ్రీ కాళికాదేవి ఇసుక, మొరం క్వారీ లేబర్ కాంట్రాక్టు సహకార సంఘం లిమిటెడ్ రాజుపేట ( కొత్తూరు ) పాలకమండలి సభ్యులకు ఎన్నికలు జనరల్ అభ్యర్థులు 7 గురు సభ్యులకు గాను 11 మంది పోటీ చేశారు. మహిళా అభ్యర్థులకు 02గాను గాను ముగ్గురి సభ్యులు పోటీ పడ్డారు. జరిగిన ఎన్నికలో మెజారిటీ వచ్చిన జనరల్ అభ్యర్థులు .కారం పాపారావు,కారం పార్వతి,.కురుసం అనసూర్య,.కురుసం బిక్షపతి,కుర్సం శ్రీహరి,సోలం ఆదిలక్ష్మి,పూనెం నాగేశ్వరావు. మహిళ అభ్యర్థుల పోటీలోబొగ్గుల నాగ సమ్మక్క,కురుసం కాళికాలకు మెజారిటీ వచ్చింది. మెజారిటీ వచ్చిన సభ్యులను పాలకమండలి సభ్యులుగా ఎన్నికల అధికారి ఎం. రాజేష్ సీనియర్ ఇన్స్పెక్టర్ డి సి ఓ ములుగు ప్రకటించారు. ఈకార్యక్రమం లో ఎన్నికల అధికారి, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఎన్నికలకు మంగపేట ఏ ఎస్ ఐ అబ్బయ్య ఆధ్వర్యంలో ఎలక్షన్ కేంద్రం వద్ద బందొబస్త్ ఏర్పాటు చేసారు.
