మన్యం న్యూస్ చండ్రుగొండ, మే 13 : చదువుకు పేదరికం అడ్డుకాదని, ఇష్టపడి చదవటం ద్వారా ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని జెడ్పీటీసీ కొణకండ్ల వెంకటరెడ్డి అన్నారు.శనివారం ఇటీవల వెలువడిన ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకు స్టేట్ పస్ట్ (ఎంపీసీ)ర్యాంకు సాధించిన చండ్రుగొండ గ్రామానికి చెందిన విద్యార్ధిని చింతల సింధుప్రియను ఆయన ఘనంగా సన్మానించి, ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇక్కడ పుట్టిన విద్యార్ధిని అత్యుత్తమ మార్కులు సంపాదించటం గర్వంగా ఉందన్నారు. తల్లిదండ్రులకు ఈ ప్రాంతానికి మంచిపేరు తెచ్చే ప్రతి విద్యార్ధికి ప్రత్యేకమైనా ఆధరాభిమానాలు పొందుతారన్నారు. భవిష్యత్తులో మంచి అధికారిగా, ప్రజా ప్రతినిదిగా, ఏ రంగంలోనైనా ఉన్నత పదవులు పొంది ఈ ప్రాంతానికి మంచిచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లమోతు రమణ, గుగ్గులోత్ బాబు, రుక్మిణి, నాగమణి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు అంతటి రామకృష్ణ, మనోహర్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు బొర్రా సురేష్, ఓర్సు రామకృష్ణ ,గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.