మన్యం న్యూస్ చండ్రుగొండ మే 13: మతతత్వ పార్టీ బిజెపికి భంగపాటు కర్ణాటక ఎన్నికలే నిదర్శనమని జెడ్పిటిసి కోణకండ్ల వెంకటరెడ్డి అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించటంతో శనివారం చంద్రుగొండ ప్రధాన సెంటర్ లోగల ఇందిరా గాంధీ విగ్రహం వద్ద సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా పేల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మతతత్వ పార్టీ అయినా బిజెపిని పార తోలెందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందనీ ధీమా వ్యక్తం చేశారు.మోదీ పాలనపై ప్రజల్లో అసహనం ఏర్పడిందని అన్నారు. పార్టీలో అందరూ కలిసికట్టుగా పనిచేస్తే రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నల్లమోతు రమణ,గోవిందరెడ్డి, గుగులోతు బాబు,ఇస్లావత్ రుక్మిణి, కృష్ణవేణి,వాసం శీను, బొర్రా సురేష్,ఓర్సు రామకృష్ణ, అప్పారావు అంతటి రామకృష్ణ ,మనోహర్,మదార్ సాబ్ ,పుల్లయ్య, భోగినబోయిన కోటేశ్వరరావు, కుక్కల ముత్యం, కుక్కల రత్నం, తదితరులు పాల్గొన్నారు.