- అడ్డుగోలుగా కట్టారు… అధికారులు కూల్చారు
- కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ప్రజాధనం వృధా
- ప్లాన్ ప్రకారం కట్టకపోవడంతో 9 పిల్లర్లను ధ్వంసం
- చేయించిన అధికారులు
- కాంట్రాక్టర్ ఇష్టానుసారం.. నిర్మాణంలో జాప్యం
మన్యం న్యూస్ గుండాల..కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరితో ప్రజాధనం వృధా అవుతుంది. ఇప్పటికే గడువు ముగిసిన కానీ పనుల మాత్రం వేగం పెరగట్లేదు. గత ఆగస్టులో ప్రారంభమైన భవనం ఇప్పటికీ పిల్లర్ల్ల దశలోనే ఉంది. గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.50 లక్షల రూపాయలతో డాక్టర్ నివాస గృహాలను ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మంజూరు చేయించారు. దీని గడువు ఫిబ్రవరి 20 తోనే ముగిసిన ఇప్పటికీ నిర్మాణం మాత్రం పిల్లర్ల దశలోనే ఉంది. దీనికి తోడు కాంట్రాక్టర్ సొంత నిర్ణయాలతో ఇంజనీర్ డ్రాయింగ్ ప్రకారం సీల్ నిర్మాణం చేపట్టకుండా ఒకేరోజు పది అడుగుల మేర 9 పిల్లర్లను నిర్మించారు. దీనికి పూర్తి అభ్యంతరం తెలిపిన ఐటీడీఏ అధికారులు 9 పిల్లర్లను సగానికి కూల్చేశారు అసలే పని పూర్తికాక ఉన్న సమయంలో పిల్లర్లు కూలుస్తూ మరింత ఆలస్యానికి కాంట్రాక్టర్ చేస్తున్నాడు. ఐటీడీఏ పరిధిలో జరుగుతున్న పనులలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతోనే ప్రజాధనానికి పెద్ద ఎత్తున గండిపడుతున్నట్లు ఆరోపణలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఐటీడీఏ ఉన్నత అధికారులు స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
.
*డ్రాయింగ్ ప్రకారం కట్టకపోవడంతోనే పిల్లర్లను తొలగించమని చెప్పాం ఏఈ శ్రీకాంత్
:పిల్లర్ల తొలగింపు పై మన్యం న్యూస్ ఐ టి డి ఏ ఏ ఈ శ్రీకాంత్ ను వివరణ కోరగా డ్రాయింగ్ ప్రకారం కాంట్రాక్టర్ నిర్మాణం చేపట్టకపోవడంతో తొలగించాలని ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలోనే కాంట్రాక్టర్ను మార్చి నిర్మాణం వేగం పెంచి పూర్తి చేస్తామని అన్నారు .