- మనసున్న మారాజు ముఖ్యమంత్రి కేసీఆర్
- సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే గ్రామాల అభివృద్ధి
- రూ.1.60కోట్లతో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా శంకుస్థాపనలు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి సాధించాలంటే కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మారాజుగా అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రానికి వన్నెతేస్తున్నాయని గ్రామాలు అభివృద్ధి పరచడమే కాకుండా ప్రజల సౌకర్యార్థం అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పల్లె జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పట్టణంలో ఎమ్మెల్యే రేగా బైక్ పై విస్తృతంగా పర్యటించి, గణేష్ కాలనీ, మేడే కాలనీ, ముత్యాలమ్మ పేట, సుందరయ్య నగర్, కండక్టర్స్ కాలనీ, బొగ్గుచూర ఏరియా, గాంధీనగర్, రాజీవ్ నగర్, భాస్కర్ నగర్, విజయనగర్, పాలకేంద్రం, బసవ క్యాంపు ఏరియాలలో సుమారు సుమారు కోటి 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు .ఈసందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో అనతి కాలంలోనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది అని అన్నారు
తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ సారథ్యంలో విద్య వైద్యం వ్యవసాయం మౌలిక వసతుల సంక్షేమ రంగాలలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నారు.గ్రామాలలో ఒకప్పుడు మట్టి రోడ్లు ఉండేవి కానీ ఇప్పుడు ప్రతి గల్లీకి సీసీ రోడ్లు బీటీ రోడ్ల నిర్మాణం వేస్తున్నట్లు ఆయన తెలిపారు
రాష్ట్రంలో ఉన్న ప్రతి పల్లెల స్వరూపాన్ని పూర్తిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని, పల్లెల్లో ప్రగతికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.పల్లెలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ప్రజలు సంతోషంగా జీవించాలనే దే తన ప్రధాన లక్ష్యమని అన్నారు పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ సారాధ్యంలో బి ఆర్ ఎస్ పార్టీకి ప్రతి కుటుంబం అండగా నిలవాలని అన్నారు .గతంలో ఎన్నడూ లేని విధంగా పినపాక నియోజకవర్గం అభివృద్ధి పథంలో తీసుకపోతున్నామన్నారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ నేతృతంలో అడిగిన వెంటనే కోట్లాది రూపాయలు నిధులను మంజూరు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు .ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండలం బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు , నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువజన విభాగం నాయకులు, పలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.