మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలానికి చెందిన డాక్టర్ చెన్నం సత్యనారాయణ, ప్రసాద్ ల అమ్మ సావిత్రమ్మ అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి మృతురాలి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలవేసి ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నివాళులర్పించారు, అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. సావిత్రమ్మ అకాల మరణం ఎంతో బాధాకరమని అన్నారు.
