- రేపే పాలిసెట్ 2023 పరీక్ష
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 13 పరీక్షా కేంద్రాలు
- ఖమ్మంజిల్లా సత్తుపల్లిలో 3 పరీక్ష కేంద్రాలు
- పరీక్ష రాయబోయే మొత్తం విద్యార్థులు 3945
- పరీక్ష జిల్లా కోఆర్డినేటర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ నాగముణి నాయక్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ఈనెల 17 బుధవారం పాలిసెట్ 2023 పరీక్షను నిర్వహిస్తున్నట్లు పాలిసెట్ పరీక్ష జిల్లా కోఆర్డినేటర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ నాగముణి నాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.పరీక్ష సమయం ఉదయం 11 గంటల నుంచి మద్యహనం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంభందించి అన్నీఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అభ్యర్ధులు అందరూ పరీక్ష సమయం కంటే గంటముందుగా హాజరుకావాలని కోరారు.పరీక్షా సమయము 11.00 గంటలుతరువాత ఒక నిమిషము లేట్ గా వచ్చిన పరీక్ష హాల్ లోకి అనుమతి ఉండదన్నారు.అభ్యర్ధులు అందరూ హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకొని పరీక్షకు హాజరు కావాలన్నరు. పాలిసెట్ పరీక్ష నిర్వహణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 13 పరీక్ష కేంద్రాలు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మూడు పరీక్ష కేంద్రాలు మొత్తం 16 పరీక్ష కేంద్రాలలో మొత్తం 3945 మంది అభ్యర్థులు రాయనున్నారని తెలిపారు. కొత్తగూడెంలో ఏడు పరీక్ష కేంద్రాలను 1746 మంది అభ్యర్థులు, పాలవంచలో ఒక పరీక్ష కేంద్రంలో 300 మంది మణుగూరు రెండు పరీక్ష కేంద్రాలలో 450 మంది భద్రాచలం మూడు పరీక్ష కేంద్రాల్లో 699 మంది సత్తుపల్లి మూడు పరీక్ష కేంద్రాల్లో 750 మంది అభ్యర్థులు పాలిసెట్ పరీక్షను రాస్తున్నారన్నారు.అభ్యర్ధులు అందరూ, హెచ్బి బ్లాక్ లేక బ్లూ పెన్సిళ్ళు, పెన్నులు మరియు ఎరేజర్లు
తమతో పరీక్షకు తీసుకొని సమయానికి రాగలరనికొరారు. అభ్యర్ధులు అందరూ కోవిడ్
నిభందనలు పాటించగలరని. హాల్ టికెట్ లో ఫోటో లేని వారు, పాస్ పోర్ట్ సైజు ఫోటో
మీదా, గెజిటెడ్ ఆఫీసర్ తో సంతకము చేయించి, తీసుకొని రావాలన్నారు. ఐడెంటిటీ (ఐడి)
కొరకు ఆధార్ కార్డ్ తీసుకొని రావాలని పరీక్షా కేంద్రాలు, కొత్తగూడెం, పాల్వంచ,
మణుగూరు, సత్తుపల్లి, భద్రాచలం తదితర పరీక్ష కేంద్రాలకుగూగుల్ లొకేషన్ యాప్ ఉపయోగించి
సెంటర్లకు చేరుకోవాలన్నరు.