మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి మే 15: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రములో గల బాలుర గురుకుల పాఠశాల క్రీడా ప్రాంగణంలో మండల స్థాయి కేసిఆర్ కప్ క్రీడా పోటీలు సోమవారం ప్రారంభంమయ్యయీ.ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా అన్నపురెడ్డిపల్లి ఎంపీపీ సున్నం లలిత పాల్గోని రిబ్బన్ కట్ చేసి క్రీడా పోటీలు ప్రారంభించారు.అనంతరం ఎంపిడివో అన్నపూర్ణ మాట్లాడుతు మండల స్థాయి కేసిఆర్ కప్ క్రీడా పోటీలు మే 15 నుంచి 17 వ తారీకు అనగా మూడు రోజుల పాటు నిర్వహిస్తామని తెలిపారు.ఈ క్రీడా పోటీలకు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు ఎవరైనా బాల,బాలికలు పాల్గొనవచ్చాని ఆమె తెలిపారు.కేసిఆర్ కప్ క్రీడాలలో నిర్వహించే పోటీలు అథ్లెటిక్స్ 100 మీటర్లు,400మీటర్లు పరుగు పందెలు,ఫుట్ బాల్,కబడ్డీ,ఖోఖో,వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నమని తెలియజేశారు.ఈ క్రీడ పోటీలలో గెలుపొందిన విజేతలు జిల్లా స్థాయిలో ఆడతారని ఆమె తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిడివో అన్నపూర్ణ,తహశీల్దార్ ఎం.భద్రకాళి,మండల పంచాయతీ అధికారిని షేక్.షభాన,సర్పంచులు,పంచాయతీ కార్యదర్శులు,పీఈటిలు తదితరులు పాల్గొన్నారు