మన్యం న్యూస్, అశ్వరావుపేట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డా.వినీత్ అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ ను సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన పలు కేసుల ఫైళ్లను,పోలీస్ స్టేషన్ రికార్డులను తనిఖీ చేశారు.పోలీస్ స్టేషన్ కు వివిధ సమస్యలతో వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు.బాధితులకు న్యాయం చేకూర్చి పోలీస్ శాఖపై మరింత నమ్మకం పెరిగేలా పనిచేయాలని సూచించారు.అనంతరం సిబ్బంది సమస్యలను అడిగి తెలుకున్నారు.పాల్వంచ డిఎస్పీవెంకటేష్,అశ్వారావుపేట సిఐ బాలకృష్ణ,ఎస్సై రాజేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.