మన్యం న్యూస్ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన జాడి శ్రీను (30) ఇటీవల గుండెపోటుతో మరణించాడు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా వారు మృతుని కుటుంబానికి రూ. 6,500 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లారెడ్డి,మండల అధ్యక్షులు సునీల్ కుమార్, ఎంపీపీ విజయ నాగరాజు,వైస్ ఎంపీపీ తుమ్మ సంజీవరెడ్డి, స్థానిక సర్పంచ్ ఈసం రామ్మూర్తి, టిఆర్ఎస్ నాయకులు చంద్రబాబు, బోజరావు, తదితరులు పాల్గొన్నారు.
