UPDATES  

 పినపాక మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే రేగా

 

మన్యం న్యూస్, పినపాక:

పినపాక మండలం లోని పలు గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు విస్తృతంగా పర్యటించారు.పాత రెడ్డిపాలెం గ్రామానికి చెందిన అనుమాటి శివయ్య, పుష్ప దంపతులకు కుమార్తె అనూష నిశ్చితార్థ వేడుకకు హాజరై కాబోయే నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు.వెంకట్రావుపేట గ్రామానికి పొనగంటి వెంకటస్వామి (80) కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో వారి నివాసానికి వెళ్లి దశదినకర్మలకు హాజరై మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.అదే గ్రామానికి చెందిన రెడ్డబోయిన రమేష్ (38) ములుగు జిల్లా వెంకటాపురం అబ్బుగూడెం గ్రామంలో ప్రమాదవశాత్తు గోదావరిలో పడి మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించారు.జానంపేటలో జిమ్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది.ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరు నడక, వ్యాయామం, దేహ దారుఢ్యం క్రీడల యందు కొంత సమయాన్ని కేటాయించుకొని ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని యువత బాడీ బిల్డింగ్, ఆరోగ్యంతో పాటు శారీరక సౌష్టివం మెరుగుపడతాయన్నారు. ఈ కార్యక్రమాలలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !