మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధి
ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి సమస్యల దరఖాస్తులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్య పరిష్కరించాలని ప్రజలు అందచేసిన దరఖాస్తులను ఆయా శాఖల జిల్లా
అధికారులకు ఎండార్స్ చేస్తున్నామని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ప్రజావాణిలో సమస్య పరిష్కరించాలని ప్రజలు అందచేసిన దరఖాస్తులు కొన్ని::-
పాల్వంచ మండలం, కిన్నెరసాని గ్రామానికి చెందిన గుమ్మడి నాగమణి తాను వికలాంగురాలినని, డిగ్రీ వరకుచదువుకున్నానని, బేకరి స్వీట్ దుకాణం ఏర్పాటుకు రుణం మంజూరు చేయాలని చేసిన దరఖాస్తునుపరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు కొరకు జిల్లా సంక్షేమ అధికారికి తగు చర్యలు కొరకు ఎండార్స్ చేశారు.బొల్లి అంజయ్య మరి కొందరు మార్చి 2022 సంవత్సరం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు గార్డెన్ పనులుచేపట్టి సుందరంగా తీర్చిదిద్దామని, కావున ఏ కాంట్రాక్టర్ వచ్చినా గార్డెన్ పనులు తమకు కేటాయించి ఉపాధికల్పించాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు కొరకు డిఆర్డకు ఎండార్స్ చేశారు.టేకులపల్లి మండలం, బేతంపూడి గ్రామపంచాయతీకి చెందిన నునావత్ లాల్య కొత్తగూడెం ఆంధ్రాబ్యాంకుద్వారా తనకు రావాల్సిన ఫించను 14 నెలల నుంచి చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, బ్యాంకు అధికారులను సంప్రదించగా పంటరుణం తీసుకున్నారని అందువల్ల ఇవ్వమని ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అనారోగ్యంతో భాదపడుతున్న
తనకు పించను ఇప్పించాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తక్షణమే పించను చెల్లించు విధంగా చర్యల తీసుకోవాలని ఎన్డీయంను ఆదేశించారు.పాల్వంచ మండలం, పాండురంగాపురం గ్రామానికి చెందిన పి పద్మ తనకు పాతకాలం నాటి పెంకుటిల్లుఉన్నదని, వర్షాలకు కురుస్తున్నదని, ఇల్లు కట్టుకునే స్థితిలో లేనని తెలియచేస్తూ ఇల్లు మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం డిఆర్డకు ఎండార్స్ చేశారు.
చండ్రుగొండ మండలం, తిప్పనపల్లి గ్రామానికి చెందిన ఎల్లబోయిన వీరమ్మ తన భర్త 10 సంవత్సరాల క్రితం
మరణించారని, తన భర్త పేరున ఉన్న ఖాళీస్థలంలో రేకులషెడ్ వేసుకుని జీవిస్తున్నానని, ప్రధానమంత్రి ఆవాస్ యోజనక్రింద ఇల్లు మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం డిఆర్డు ఎండార్స్ చేశారు.అశ్వాపురం మండలం, నారంవారిగూడెం గ్రామానికి చెందిన గోపిన చినలక్ష్మి సర్వే నెం.132/1ఆలో 33కుంటలు, 151/1అలో 3.01 కుంటలు, 454/అలో 1.02 కుంటలు మొత్తం 4.36 ఎకరాలు భూమి తనకు వారసత్వంగా
సంక్రమించిందని, ఇట్టి భూమికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి తన అత్త గోపిన రాజమ్మ పేరున
యు 270897 ఖాతా నెం. 97తో పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేసియున్నారని, తన అత్త వారసత్వ గిఫ్ట్ దస్తావేసు వ్రాసిచ్చారని, అట్టి భూమికి తెలంగాణ డిజిటల్ పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాలని చేసినధరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం ధరణి సెల్కు ఎండార్స్ చేశారు.ఇస్లావత్ పార్వతి, భర్త లేటు హరిచంద్ తేది జనవరి 2వ తేదీ 2021న మరణించారని, వింతంతు పించను కొరకు దరఖాస్తు చేసుకున్నానని, తనకు వితంతు పింఛను మంజూరు చేయాల్సిందిగా చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్తగు చర్యలు నిమిత్తం డిఆర్డిఓకు ఎండార్స్ చేశారు.ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.