మన్యం న్యూస్,ఇల్లందు:కామేపల్లి మండలం అడవి మద్దెలపల్లి గ్రామపంచాయతీలో గల గంగమ్మ తల్లి ఆలయంలో ప్రతిఏటా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించిన జాతరలో ఇల్లందు శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే పాల్గొని గంగమ్మతల్లి ఆలయకమిటీ వారికి రూ.50 వేల రూపాయల విరాళం అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ ఎమ్మెల్యేని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ సునీత, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ధనియాకుల హనుమంతరావు, రైతుబంధు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు అంతోటి అచ్చయ్య, కోట మైసమ్మ ఆలయ కమిటీ చైర్మన్ మల్లెంపాటి శ్రీనివాసరావు, కామేపల్లి సర్పంచ్ అజ్మీర రాందాస్, గంగమ్మతల్లి ఆలయ కమిటీ కాట్రాల మల్లయ్య, రోశయ్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.