మన్యం న్యూస్ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ ఆధ్వర్యంలో సోమవారం ఏటూరు నాగారం మండల కేంద్రంలో మండల యూత్ కన్వీనర్ గా మండల కేంద్రానికి చెందిన కుదురుపాక రాజేశ్ కు నియామక పత్రం అందజేశారు.అనంతరం జాతీయ బిసి సంక్షేమ సంఘం నాయకులు బట్ట మురళీకృష్ణ మాట్లాడుతూ ఏటూరు నాగారం మండలంలోని బీసీల పలు సమస్యల పట్ల నిరంతరం కృషి చేయాలని బీసీలకు చెందవలసిన సంక్షేమ పథకాలు ఆర్థిక రాజకీయ పరమైన అంశాలపై పాటుపడాలని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం జిల్లా నాయకులు మంచెర్ల నాగేశ్వరరావు,బట్ట గోపి,కర్ల రాజు రెబ్బల సత్యం,చెన్న రమేష్,కోపిరి వంశీ, తదితరులు పాల్గొన్నారు.
