- ఆటాడుకుందాం రండి..
- యువత క్రీడలలో రాణించాలి.
- సీఎం కప్ క్రీడలను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు
మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 15
మణుగూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జిల్లా యువజన,క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీఎం కప్ క్రీడలను సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. తొలిత క్రీడాకారులను పరిచయం చేసుకుని,వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్,రేగా కాంతారావు మాట్లాడుతూ,15 ఏళ్ల నుంచి 36 ఏళ్లు వయస్సు ఉన్న యువతి,యువకులు సీఎం కప్ పోటీలో పాల్గొనేందుకు అర్హులని అన్నారు.నేటి నుండి మే 17వ తేదీ వరకు మండల స్థాయిలో క్రీడాలు జరుగుతాయని వారు తెలిపారు.జిల్లా స్థాయిలో గెలుపొందిన జట్లు,రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీలలో పాల్గొంటారని తెలిపారు.క్రీడలు మానసిక ఉల్లాసాన్ని,పెంపొందిస్తున్నాయని అన్నారు.శారీరక శ్రమతో కూడిన క్రీడలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని అన్నారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకుపోతుంది అన్నారు. అన్ని రకాల క్రీడలను,క్రీడా రంగానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని వారు తెలిపారు.క్రీడా కారులు మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో విజయం సాధించడానికి,దేశానికి,తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ కు మంచి పేరు తేవాలని కోరారు.నాకు క్రీడలు అంటే ఇష్టం అని,క్రీడాకారులకు నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేసింది అన్నారు.యువతీ యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం.నరసింహారావు,తహసిల్దార్ నాగరాజు,ఎండిఓ చంద్రమౌళి, పిఎసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,ఎంపీటీసీల సంఘం జిల్లా కార్యదర్శి గుడిపూడి.కోటేశ్వరరావు,కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా, స్థానిక సర్పంచ్ లు బచ్చల భారతి,ఏనిక ప్రసాద్,మండల ప్రజా ప్రతినిధులు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు, పార్టీ నాయకులు,యువజన నాయకులు,యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.