UPDATES  

 గిరిజనుల అభివృద్ధికి పాటుపడాలి ఏటూరు నాగారం ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారి అంకిత్.

మన్యం న్యూస్ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్ లో గిరిజనల నుండి వచ్చిన వినతులను నేరుగా స్వీకరించి సమస్యలను త్వరితగతిన పరిష్కారం చూపాలని సంబంధిత సెక్టార్ అధికారులకు ప్రాజెక్టు అధికారి, అంకిత్ ఆదేశించినారు.ఈ గిరిజన దర్బార్ లో వివిధ మండలాల నుండి వచ్చిన గిరిజనులు 14 దరఖాస్తులను గిరిజనులు సమర్పించడం జరిగింది. మహబూబాద్ జిల్లా ముత్యాలమ్మ గూడెం, జమెడ్లపల్లి గ్రామానికి చెందిన సోలెం నారాయణ,బుర్కా దేవేందర్,బోల్లి లక్ష్మయ్య మాకు పొడుభుముల హక్కు పత్రాలు ఉన్నాయని ఫారెస్ట్ అధికారులు వారు ఖాస్తు చేయుచున్న భూమిలో బలవంతంగా ట్రెంచ్ కటింగ్ చేసి మొక్కలు పెట్టే ప్రయత్నం చేయుచుండగా మేము గౌరవ హైకోర్టు నుండి స్టే తీసుకొచ్చినామని మాకు పోడు చేసుకోవడానికి పోడు భూమిపై సర్వహక్కులు కల్పించుట గూర్చి దరఖాస్తు చేసినారు. గూడూరు మండలం ఉట్ల మట్టవాడ గ్రామానికి చెందిన మేడ వెంకట్ కోయా రేల డాన్స్ కళాకారులకు ఎం ఎస్ ఎం ఈ యూనిట్ మంజూరు చేయుట గురించి దరఖాస్తు పెట్టుకున్నారు.
గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ బ్రాంచ్ వెంకటా పురం మండలంలోని వాసం సమ్మయ్య ఐదు సంవత్స రాలుగా లైట్ వెహికల్ డ్రైవర్ గా పనిచేయుచున్నానని నా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు.తనకు నర్సంపేట కు డిప్యూటేషన్ కల్పించి బదిలీ చేయుట గురించి దరఖాస్తు పెట్టుకున్నారు.మంగపేట మండలం చుంచు పల్లి గ్రామానికి చెందిన కోరం అబ్బయ్య ఉపాధి హామీ పథకంలోల 25 గ్రామపంచాయతీలకు గాను 24 గ్రామ పంచాయతీలకు సిసి రోడ్లు మంజూరు అయినాయి కానీ చుంచూపల్లి గ్రామంలో ఒక రోడ్డు కూడా మంజూరు కాలేదు కావున రోడ్డు మంజూరు చేయట గురించి దరఖాస్తు చేసినారు. కబ్బాక శ్రావణ్ కుమార్ తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొమరం భీం స్మృతి వనంకు కేటాయించిన భూమి ప్రభుత్వం స్వాధీన పరచుకొని అగ్రిమెంటు చేయుట గురించి దరఖాస్తు చేసినారు.తాడ్వాయి మండలం పడిగాపూర్ గ్రామానికి చెందిన మైతా లక్ష్మయ్య నాకు హాస్పటల్ యందు ఖర్చు నిమిత్తం ఆర్థిక సాయం ట్రైబల్ రిలీఫ్ ఫండ్ కింద మంజుల చేయుట గురించి దరఖాస్తు చేసినారు.ఆదివాసి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడెం బాబు ఏటూర్ నాగారం లోని ఏపీఆర్జేసీ మహిళా కళాశాల,ఆకుల వారి ఘనపూర్ ప్రిన్సిపాల్ ని తొలగించి వేరొక ప్రిన్సిపాల్ నియమించడం గూర్చి దరఖాస్తు చేసినారు..
మహబూబాద్ జిల్లా ఎన్జీవో కాలనీకు చెందిన బానోతు ధనుశ్రీ క్రీడా భవిష్యత్ కోరుకుంటున్న గిరిజన లంబాడ చదరంగం క్రీడాకారునికి చేయుట ద్వారా ఆర్థిక సహాయం చేయడం గూర్చి దరఖాస్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీవో వసంతరావు,డిప్యూటీ డైరెక్టర్ వై.పోచం,ఏవో దామోదర స్వామి,ఎస్ఓ రాజ్ కుమార్, పి హెచ్ ఓ రమణ,ప్రాజెక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ భారతి,జిసిసి మేనేజర్ స్వామి,డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ క్రాంతి కుమార్,ఐటిడిఏ మేనేజర్ శ్రీనివాస్,ఫారెస్ట్ అధికారులు,గ్రీవెన్స్ సెల్ లో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !