మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 15
మణుగూరు సింగరేణి ఏరియా లో సింగరేణి కాలరీస్ సివిల్ జనరల్ మేనేజర్ టి. సూర్యనారాయణ పర్యటించారు.ముందుగా కేసిహెచ్ పి,పికేఓసి-2 ఎక్స్ టెన్షన్,ఏరియాలో నూతనంగా నిర్మిస్తున్న సైట్ ఆఫీస్ భవనాలను,బేస్ వర్క్ షాప్ భవనాలను వారు తనిఖీ చేశారు.అనంతరం సివిల్ డిపార్ట్మెంట్ స్టాఫ్,సివిల్ కాంట్రాక్టర్లను ఉద్దేశించి మాట్లాడుతూ,షెడ్యూల్ ప్రకారం నూతన భవనాలను త్వరితగిన పూర్తి చేసి బొగ్గు ఉత్పత్తి చేసేందుకు దోహదపడాలని ఆదేశించారు. సింగరేణి కాలరీస్ సివిల్ జనరల్ మేనేజర్ కార్పొరేట్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన టి.సూర్య నారాయణ మొట్ట మొదటి సారిగా మణుగూరు పర్యటన కు విచ్చేసిన సందర్భంగా జిఎం ఛాంబర్ లో ఏరియా జిఎం దుర్గం.రామ చందర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏరియా జిఎం దుర్గం.రామచందర్ సివిల్ జనరల్ మేనేజర్ కార్పొరేట్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించినందుకు గాను టి. సూర్యనారాయణ కు అభినందనలు తెలియజేస్తూ, ఆత్మీయ సత్కారం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ఓ టూ జిఎం డి.లలిత్ కుమార్,ఏజిఎం సివిల్ డి. వెంకటేశ్వర్లు,ఏరియా ఇంజినీర్ ఎం.నర్సీ రెడ్డి,డిజిఎం పర్సనల్ ఎస్ రమేశ్,డిజిఎం ఐఈడి కే. వెంకట్ రావు,డిజిఎం పర్చేస్ శ్రీనివాస్ మూర్తి,డిజిఎం క్వాలిటీ వెంగళరావు,డిజిఎం ఫీనాన్స్ అనురాధ,ఎంవిటిసి మేనేజర్ నాగేశ్వర రావు, ఎస్ఈ ఓసి స్టోర్స్ కిశోర్ కుమార్,డివై.ఎస్ఈ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.